KTR : ఆ ఫాం హౌస్ నాది కాదు

రైతుల కోసం రణానికైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

Update: 2024-08-21 08:06 GMT

రైతుల కోసం రణానికైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమది భారత రాష్ట్ర సమితి మాత్రమే భారత రైతు సమితి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారన్నారు. రుణమాఫీ ఆందోళలను పక్కదారి పట్టించే ప్రయత్నంచేస్తున్నారన్నారు. బజారు భాష, చిల్లర భాషతో తాము పక్కదారి పట్టమని అన్న కేసీఆర్ రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు.

ఇచ్చిన హామీ మేరకు...
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు పర్చే వరకూ రైతుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవరగం కొడంగల్ లోనూ పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదన్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో పాల్గొంటారని చెప్పారు. రేపు తాను చేవెళ్లలో జరిగే నిరసనలో పాల్గొంటానని తెలిపారు. రుణమాఫీ జరగక రైతులు రోడ్డెక్కుతుంటే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ ఆనందంగా లేదని కేటీఆర్ అన్నారు. ఫాం హౌస్ తన పేరు మీద లేదని, ఒకవేళ బఫర్ జోన్ లో ఉంటే తానే కూల్చివేస్తానని తెలిపారు. తనకు తెలిసిన మిత్రుడిదని, తాను లీజుకు తీసుకున్నానని తెలిపారు.


Tags:    

Similar News